వాడివేడిగా పంచాయతీ రాజకీయాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల చేయడంతో ఒక్కసారిగా పొదిలి పంచాయతీ రాజకీయాలు ఉపందుకున్నాయి.
పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ ఏ కేటగిరి రిజర్వేషన్ అవుతుందా ?…… అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది ప్రధానంగా అధికార వర్గాల సమాచారం మేరకు ఓపెన్ కేటగిరీ లేక బిసి రిజర్వేషన్ అయ్యో అవకాశం ఉందన్న సమాచారంతో అశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఓపెన్ కేటగిరి అయితే అధికార వైసీపీ పార్టీ తరుపున మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కోడలు సానికొమ్ము ప్రత్యుషా పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా…. ఒకవేళ పిచ్చిరెడ్డి కుటుంబం నుండి పోటీకి ఆసక్తి చూపకపోతే ఇతరులవైపు పార్టీ చూపు ఉంటుందని వైసీపీ వర్గాల ద్వారా సమాచారం.
రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ అయితే వైసీపీ నుండి ప్రముఖ కాంట్రాక్టర్ కల్లం సుబ్బారెడ్డి కానీ గొలమారి చెన్నారెడ్డి కానీ యక్కలి శేషగిరి రావు బరిలో నిలిచే అవకాశం ఉంది….. ఓపెన్ మరియు బిసి కేటగిరీలలో అయినా పంచాయతీ పాలకవర్గం మాజీ సభ్యురాలు షేక్ నూర్జహన్ కానీ మైనారిటీ నాయకులు షేక్ రోటీ రబ్బాని లేక ఇతరులకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అదేవిధంగా బిసి రిజర్వేషన్ అయితే మాత్రమే పోటి చేసే యోచనలో వైసీపీ జిల్లా నాయకులు జి శ్రీనివాసులు ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.
తెలుగు దేశం పార్టీ నుండి ఓపెన్ కేటగిరీ అయితే కాటూరి పెద్ద బాబు కానీ కాటూరి చిన్నబాబు కానీ కాటూరి సుబ్బయ్య కానీ గునుపూడి భాస్కర్ కానీ వెలిశెట్టి విజయగౌరీ మూరబోయిన బాబూరావు పోటీ చేసే యోచనలో ఉండగా బిసి రిజర్వేషన్ అయితే కేవలం మూరబోయిన బాబూరావు ఒక్కరే ప్రస్తుతానికి పోటీ చేసే అవకాశం ఉంది.
పట్టణంలోని వైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళానేత సామి వెంకట పద్మావతి కూడా ఓపన్ కేటగిరీలో సర్పంచ్ పదవి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు అయితే ఎ పార్టీ తరుపున బరిలో ఉంటారనేది సృష్టత రావలసిఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) తొలిసారిగా సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా జనసేన, సిపియం, సిపిఐ లోక్ సత్తా పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఏదైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన తరువాత కాని మరికొద్ది మంది అశావహులు పోటీకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా.