రేపటినుండి నివేశన స్థలాల గ్రామసభలు : తహశీల్దార్ ప్రభాకరరావు
మండలంలోని అన్ని గ్రామాలలో రేపటినుండి ఇంటి నివేశన స్థలాల గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని గ్రామాలలో 17వతేదీ గురువారంనాడు అక్కచెరువు, జువ్వలేరు, ఆముదాలపల్లి, అన్నవరం, కుంచేపల్లి, దాసల్లపల్లి, కొండాయపాలెం, మూగచింతల, కంభాలపాడు, ఈగలపాడు, పాములపాడు, ఓబులక్కపల్లి, నందిపాలెం, సుదనగుంట, తుమ్మగుంట, ఉప్పలపాడు, తలమళ్ల………….
18వతేది శుక్రవారంనాడు కేశవబొట్లపాలెం, చింతగంపల్లి, తీగదుర్తిపాడు, మాదాలవారిపాలెం, రామాయణకండ్రిక,
జాప్లాపురం, సలకనూతల, దొండ్లేరు, మల్లవరం………. 19వతేదీ శనివారంనాడు రాములవీడు, నిమ్మవరం…….. 20వతేది ఆదివారంనాడు టి సల్లూరు నందు ఉదయం 10గంటల నుండి 2గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుండి 6 గంటల వరకు…..
పొదిలి మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి 18తేదీ ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు నివేశన స్థలాలను మంజూరు చేయుట కొరకు ప్రచురించిన జాబితాలోని అర్హులకు సంబంధించి ఏమైనా ఆక్షేపణలు ఉన్నచో గ్రామసభలో తెలుపవచ్చునని….. అలాగే అర్హులైఉండి వారి పేర్లు జాబితాలో లేని యెడల వారి యొక్క దరఖాస్తులను గ్రామసభలో దాఖలు చేసుకోవాలని ఆయన తెలిపారు.