మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామానికి చెందిన రాచకుంట కవిత (22)కు ఆరోగ్యం బాగలేకపోవడంతో తన భర్తను ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడగగా తర్వాత తీసుకుని వెళ్తానని చెప్పి బయటికి వెళ్లగా……. ఆసుపత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలి పంపించమని తన తల్లిని కూడా అడుగగా ఆమె కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.