శివరాత్రికి ఘనంగా నివాళులర్పించిన గృహ నిర్మాణ శాఖ సిబ్బంది
పొదిలి గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో నందు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శివరాత్రి మల్లిఖార్జునరావు కోవిడ్ పోరాడి బుధవారం నాడు తుది శ్వాస విడిచారు.
గురువారం నాడు స్థానిక విశ్వనాథపురం లోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో శివరాత్రి మల్లిఖార్జునరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల గృహ నిర్మాణ శాఖ సిబ్బంది నిర్మల్, కాశీ రెడ్డి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు