ఉగాది నాటికి 5లక్షల ఇంటి నిర్మాణాలు పూర్తి గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీషా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణంలోని జగనన్న లేఔట్ నందు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీషా పర్యటించారు.
నూతనంగా నిర్మించిన ఒక నివాస గృహాని ప్రారంభించి అనంతరం లే ఔట్ ను నిర్మాణ పనులు మౌళిక సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి 5 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా లక్ష్యంగా పని చేస్తున్నామని లబ్దిదారులకు అని రకాల సహా సహాకారలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ పవన్ కుమార్ మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు