దేవస్థానం కార్యనిర్వహణాధికారి గా శ్రీనివాస్
పొదిలి సముదాయం దేవాలయాల కార్యనిర్వహణ అధికారి గా శ్రీనివాస్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని అందులో భాగంగా ఏర్పాట్లు ప్రారంభించామని ఈ నెల 28వ తేదీ స్వామి వారి కళ్యాణం మార్చి ఒకటో తేదీ మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం రెండవ తేదీన రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఏర్పాట్లు ప్రారంభించామని కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు