ఐ కంప్యూటర్స్ ఈఎంఐ విభాగం ప్రారంభించిన శాసనసభ్యులు కుందూరు
ఐ కంప్యూటర్స్ ఈఎంఐ విభాగన్ని మార్కపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. వివరాలు లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక పెద్ద మసీద్ సమీపంలో ఉన్న ఐ కంప్యూటర్స్ నందు నూతనంగా కంప్యూటర్లు, ల్యాబ్ టాప్ వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలులో నెలవారీ చెల్లింపులు చెల్లించే విధంగా బాజాజ్ ఫైనాన్స్ వారి ఈఎంఐ విభాగంను ముఖ్య అతిథిగా హాజరైన కుందురు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐ కంప్యూటర్స్ యాజమాని ముల్లా ఉస్మాన్ మరియు పట్టణ ప్రాముఖులు తదితరులు పాల్గొన్నారు