అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన
విశ్వనాథపురంలోని స్థానిక ఇస్లాంపేట ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్ర భవనం నిర్మాణానికి ఎంపీటీసీ ఇమాంసా ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ కఠారి రాజు శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కఠారి రాజు మాట్లాడుతూ చిన్నపిల్లకు, బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించడానికే కాకుండా పిల్లలు మానసికంగా ఎదగడానికి ఈ అంగన్వాడీ కేంద్రాలు స్థాపించబడ్డాయని అన్నారు. ఎంపీటీసీ సభ్యులు ఇమాంసా మాట్లాడుతూ ఈ భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత 11,12,13 వార్డుల్లోని పిల్లలను బడికి పంపించి వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రులు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఐసిడిసి ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు