అక్రమంగా రెవెన్యూ అధికారులు పాస్ బుక్ లు మంజూరు

పొదిలి మండలం నిమ్మరం రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 50/2 లోని 3.90 సెట్లు భూమిని అక్రమంగా హక్కుదారులకు తెలియకుండా ఇతరుల పేరు మీదా గత నెల 24వ తేదీన ఆన్లైన్ చేసారని బాధితులు పొదిలి మండలం రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ కు సోమవారం నాడు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బాధితుడు వెల్పుల శ్రీను మాట్లాడుతూ యఫ్ యల్ ఆర్ రికార్డు దాఖల రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 50/2 లో ప్రకారం తమకు హక్కు కల్గిన వ్యవసాయ భూమిలో తమ కుటుంబ సభ్యులు పారీఖత్తు వ్రాసుకొని

మీ సేవా కేంద్రాల్లో పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి వెళ్లగా అక్కడ ఆన్లైన్ నందు తేదీ 24.06.2022న మరో వ్యక్తి పైన 1బి నమోదు కావడంతో ఒక్కసారిగా షాక్ గురైయ్యామని సదరు విషయం పై సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకొని తహశీల్దారు కు ఫిర్యాదు చేసామని తమ భూములను తమకు పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేసే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు