చెంచాలచేత మాట్లడించడం కాదు దమ్ముంటే తెరపైకి వచ్చి మాట్లాడాలి : ఇమ్మడి యూత్

మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం సందర్భంగా యక్కంటి వెంకటరెడ్డి మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ  నేత ఇమ్మడి కాశీనాథ్ పై చేసిన వ్యాఖ్యల పట్ల నియోజకవర్గంలోని ఇమ్మడి కాశీనాథ్ అభిమానులు మరియు ఇమ్మడి యూత్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ దమ్ముంటే చెంచాల చేత కాకుండా తెరపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

దమ్ము, ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నుండి ఇమ్మడి కాశీనాథ్ ను పంపించండి చూద్దాం, నువ్వు ఎవరు?…… ఎక్కడి నుంచి వచ్చావు?
నిన్ను అలా మాట్లాడమని ఏవరు చెప్పారు?….. పార్టీలో 25సంవత్సరాల అనుభవం ఉండి అంకిత భావంతో పని చేసే నాయకుడిపై విమర్శలు చేసేందుకు నువ్వు ఎవరు?…… నీకు పార్టీ కి సంబంధం ఏంటి? మార్కాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నీ సంగతి మరోసారి నోరు జరితే నీకు నీవెనక ఉన్నవారికి సరైన బుద్ధి చెప్తామని ఎవరికైనా సరే దమ్ము, ధైర్యం ఉంటే తెర వెనుక ఉండి మాట్లాడించాటం కాదు ధైర్యంగా తెరపైకి వచ్చి మాట్లాడాలని ఒక ప్రకటనలో తెలిపారు