ఉడుముల హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి రజిని
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం నందు ఆధునిక టెక్నాలజీ తో కార్పొరేట్ స్ధాయిలోని నిర్మించిన ఉడుముల హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ప్రారంభించారు.
స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి తనయుడు డాక్టర్ అశోక్ రెడ్డి సారధ్యంలో నిర్మించిన ఉడుముల హాస్పిటల్ ప్రారంభోత్సవం కు ముఖ్య అతిథులుగా మంత్రులు విడుదల రజిని,ఆదిములపు సురేష్, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి,అన్నా వెంకట రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఉడుముల శ్రీనివాసులురెడ్డిలు పలు విభాగాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి కొనకనమిట్ల మండలం చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు