యుటియఫ్ ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్షలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పొదిలి పట్టణం నందు యుటియఫ్ నాయకులు పెమ్మని బాల వెంకటేశ్వర్లు, గురవయ్య లు నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు.


ఈ సందర్భంగా యుటియఫ్ నాయకులు పెమ్మని బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి తర్వాత మడమ తిప్పి ఓపియస్ బదులు జిపియస్ తీసుకొని రావటం ద్వారా ఉద్యోగాలను మోసం చేసారని అందుకు నిరసిస్తూ నిరవధిక నిరహార దీక్షలు చేపట్టామని తమ హామీలు అమలు అయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో యుటియఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు