సైన్యం మెరుపు దాడిల్లో 6-10 మంది పాక్ సైనికులు హతం : ఆర్మీ చీఫ్ వెల్లడి
కాల్పులులో విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బదులిచ్చిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఆదివారం సాయంత్రం మీడియా ఆయన మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్‌ల మీద భారత ఆర్మీ మెరుపుదాడులు చేసిందిని ఈ దాడుల్లో ఆరు నుంచి 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు . తాంగ్ధర్ వద్ద జరిగిన దాడుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ‘నిన్న రాత్రి తాంగ్ధర్ ప్రాంతంలో చొరబాటుకు టెర్రరిస్టులు ప్రయత్నించారని ఆ సమయంలో భారత ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపిందిని దాన్ని మేం తిప్పికొట్టాం చొరబాట్లను అడ్డుకున్నాం అని రావత్ తెలిపారు.