అక్రమంగా తరలిస్తున్న 94మద్యం సీసాలు స్వాధీనం…. ఒకరి అరెస్టు
పట్టణంలోని స్థానిక చిన్నబస్టాండ్ నందు మద్యం అక్రమంగా తరలిస్తున్న సమాచారంతో ఎక్సైజ్ సిఐ వెంకట్రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఇండికా కారులో అక్రమంగా తరలిస్తున్న 94మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ బి వెంకట్రావు తెలిపారు.
ఈ తనిఖీల్లో యస్ ఐ యం వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ఖాజా ఖాన్, కానిస్టేబుళ్లు బాజీ సయ్యద్, శంకర్ నాయక్ యస్దాని పాల్గొన్నారు.