చిన్న మసీదు, పెద్ద మసీదు భూముల్లో అక్రమాలపై విచారణ
చిన్న మసీదు, పెద్ద మసీదు భూముల్లో అక్రమాలపై జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే గురువారంనాడు చిన్న మసీదు, పెద్ద మసీదు సంబంధించిన భూముల్లో అక్రమంగా శాశ్వత నిర్మాణం చేపట్టడం, గత చిన్న మసీదు, పెద్ద మసీదు పాలకవర్గం ఆస్తులు కాపాడడంలో విఫలం మరియు అక్రమంగా ఆస్తులను లీజులకు ఇవ్వడంపై ముస్లిం హక్కుల పోరాట సమితి ఫిర్యాదు మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సహాయ కార్యదర్శి ఆదాం షఫీ సారధ్యంలోని బృందం పట్టణంలో పర్యటించి ఫిర్యాదులో పొందు పరిచిన అక్రమాలపై ఆక్రమణకు గురైన ఆస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు సహాయ కార్యదర్శి ఆదాం షఫీ మాట్లాడుతూ చిన్న మసీదు మరియు పెద్ద మసీదుకు సంబంధించిన 365 ఎకరాల భూమిలో ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని…… శాశ్వత నిర్మాణాలు కూడా జరిగాయని వాటిపై నివేదికను రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ కు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ ఖుదావన్ , తెలుగుదేశం పార్టీ పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షకార్యదర్శులు షేక్ ఇబ్రహీం ఖలీల్, సయ్యద్ భాషా, పొదిలి మండల అధ్యక్షులు ముల్లా సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.