ముమ్మరంగా శానిటేషన్ పనులు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండలం వేల్లురు గ్రామం నందు సర్పంచ్ శింగయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు నిర్వహించారు.

మంగళవారం నాడు వేలురు గ్రామ పంచాయతీ పరిధిలోని వేలురు, నల్లారెడ్డి పాలెం, టి సల్లూరు , పూణేరివారిపాలెం, నందు పంచాయితీ కార్యదర్శి శేషగిరిరావు ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎబెట్ దోమల మందు ను పిచికారి చేసారు.

పలు ప్రాంతాల్లో జంగిల్ పనులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు