సీలిండర్లు ఉపయోగం పై అవగాహన సదస్సు
వంట గ్యాస్ సీలిండర్లు ఉపయోగించే వినియోగదారులకు భద్రతా నియమాలు, గ్యాస్ పొదుపు కొరకు సూచనలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండెన్ గ్యాస్ అధికారి మానస్ కుమార్ గుహ తెలియజేశారు మంగళవారం ఆక్స్ఫర్డ్ స్కూల్ లో స్థానిక కరుణ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో జరిగిన గ్యాస్ వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస్ కుమార్ గుహ మాట్లాడుతూ త్వరలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వినియోగదారుల గ్యాస్ కనెక్షన్లును ఆయిల్ కంపెనీ వారి తరపున స్వయంగా పరిశీలించి కస్టమర్లకు తగిన జాగ్రత్తలు, సూచనలు చేస్తుంటాము, ఆ కార్యక్రమం త్వరలోనే పొదిలి తో సహా జిల్లా మొత్తం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.ఈ తనిఖీ నిమిత్తం వినియోగదారులు మూడు సంవత్సరాల కాల పరిమితికి గాను 175/- చెల్లించవలసి ఉంటుందని, అందుకుగాను ప్రతి ఒక్కళ్ళకి ప్రమాదఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు ఇతర సౌలభ్యాలు అన్ని వర్తిస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా భద్రతా సూచనలు నియమాలను తెలియచేశారు కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ రామాంజనేయులు, కరుణ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ కరుణ, విద్యార్థినులు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు