ఇరిగేషన్ ఆక్రమణల తొలగింపు భాధ్యత పంచాయతీ,రెవెన్యూ శాఖలదే: ఇరిగేషన్ డిఈ శివరామ ప్రసాద్
ఇరిగేషన్ ఆక్రమణల తొలగింపు భాధ్యత పంచాయతీ,రెవెన్యూ శాఖలదేనని పొదిలి ఇరిగేషన్ డిఈ శివరామ ప్రసాద్ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్థానిక పెద్ద చెరువుకు చెందిన భూమిలో అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం డిఈ శివరామ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పెద్దచెరువు,చిన్నచెరువుకు చెందిన భూమి సర్వే చేయడం జరిగిందని సదరు నివేదిక రాగానే న్యాయపరమైన చర్యలకై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని…. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే బాధ్యత పంచాయతీ,రెవెన్యూ అధికారులదేనని అన్నారు.