అందరు ఉన్నా ఆమె అనాధ ?
ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది…. ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఈమె జీవితం!
ప్రకాశంజిల్లా పొదిలి పట్టణానికి చెందిన ఒక వృద్ధ మహిళ గత కొన్నిరోజులుగా పొదిలి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న కాంప్లెక్స్ మెట్ల వద్ద కాలం వెళ్లదీస్తుంది.
గత కొన్నిరోజులుగా అక్కడే ఉంటూ ఎవరినీ ఏమీ అడగదు ఏమీ చెప్పదు సమయానికి ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటుంది లేకపోతే మంచినీళ్లతో కాలం వెళ్లదీస్తుంది. ఈమె గురించి పరిసరాల్లో విచారిస్తే ఈమెకు ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నట్లుగా తెలిసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా
అంతంతమాత్రంగానే ఉంది. ఆ పండుటాకు రాలకముందే సాటి మనిషిగా స్పందించి మానవత్వం చాటుకోండి.
దయగల దాతలు చేరదీసి ఆమెకు ఆశ్రయం కల్పించండి. వీలైతే ప్రభుత్వాధికారులు వారి సంతానాన్ని తగిన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె ప్రాణాన్ని కాపాడండి.
విశ్వనాథం జె.కె (కథనం)…..