జగన్ జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 45వ జన్మదిన వేడుకలు స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద జరుగుతాయని జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు, మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ప్రభుత్వ వైద్యశాల నందు కేక్ కటింగ్, తదుపరి రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు . కావున ఈ కార్యక్రమంలో జగనన్న అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ఆ ప్రకటనలో కోరారు.