జగన్ ముఖ్యమంత్రి కావటం తథ్యం: జంకె
రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యంని మార్కపురం శాసనసభ్యాలు జంకె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయంపొదిలి మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జగనన్న పాదయాత్ర విజయవంతం అయ్యి ముఖ్యమంత్రి కావలని అకాంక్షిస్తు గొల్లపల్లి ఆంజనేయస్వామి గుడి నుండి సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి గుడి వరుకు గొల్లపల్లి జగన్ యూత్ అధ్యక్షులు పేరం చెంచంరెడ్డి ఆద్వర్యంలో పాదయాత్ర కార్యక్రమంని ముఖ్య అతిదిగా హాజరైన జంకె వెంకట రెడ్డి ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నియైజకవర్గం లో జరిగే జగన్ పాదయాత్ర ను విజయవంతం చేయలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, ఎంపీపీ నర్సింహారావు వైసీపీ జిల్లా నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి జి శ్రీనువాసులు గొలమారి చెన్నారెడ్డి వాకా వెంకటరెడ్డి విద్యార్థి విభాగం కార్యదర్శి రాజశేఖర్ మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి మండల నాయకులు బ్రహ్మరెడ్డి కృష్ణరెడ్డి వెలుగోలు కాశీ గొల్లపల్లి గ్రామ పంచాయతీ నాయకులు పేరం చెంచురెడ్డి తదితరులు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.