జగనన్న స్వచ్చ సంకల్ప ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు సోమవారం నాడు జగనన్న స్వచ్చ సంకల్పం శిక్షణ తరగతులు నిర్వహించి అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి విశ్వనాథపురం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, మరియు గ్రామీణ మండలం చెందిన సర్పంచ్ లు , ఎయన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు