జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన ర్యాలీ

పొదిలి పట్టణం నందు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దారు దేవీప్రసాద్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ రుణం తీసుకొని సకాలంలో రుణాలు చెల్లింపులు చెయ్యని వారికి రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 10 వేలు మున్సిపల్ పరిధిలోని వారికి 15 వేలు మహా నగర పాలక సంస్థ పరిధిలో 20 వేలు రూపాయలు చెల్లించి శాశ్వత హక్కులు పొందవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజనీర్ కె వి భాస్కర్, వెలుగు ఎంపియం మాణిక్య రావు, నగర పంచాయితీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు ఆర్ఐ సుబ్బారావు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు