వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రజా వైద్యులు యర్రం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు మరియు పలు సేవా కార్యక్రమాలు ‌నిర్వహించారు.

స్థానిక చిన్న బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను స్ధానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు.

తదుపరి మహిళలకు చీరలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో ఉన్న భవిత పాఠశాల నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను మాజీ శాసనసభ్యులు. ఉడుముల శ్రీనివాసులురెడ్డి కోసి విద్యార్థుల పంచి పెట్టారు.

అనంతరం భవిత పాఠశాల విద్యార్థులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజా వైద్యులు యర్రం వెంకట రెడ్డి జన్మదిన సందర్భంగా నగర పంచాయితీ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు ‌నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి‌, కల్లం వెంకట సుబ్బారెడ్డి,గొలమారి చెన్నారెడ్డి,జి శ్రీనివాసులు, వినోద్, బ్రహ్మ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు