మద్యం సేవించి వాహనం నడిపినవారికి జైలు శిక్ష- ఠాణా అధికారి శ్రీహరి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష విధించారని పొదిలి ఠాణా అధికారి శ్రీహరి సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటివల జరిగే రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం సేవించి వాహనం నడిపి ఇతర ప్రాణాలకు ఇబ్బందులు కల్గిస్తున్నా కారణంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పొదిలి ఠాణా పరిధిలో పరిమితి మించి మద్యం సేవించి పట్టుబడిన 11 మందిలో నాలుగురికి వారం రోజుల జైలు శిక్ష మరియు 500 వందల రూపాయలు జరిమానా మీగత ఏడుగురికి 5000 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఠాణా అధికారి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు