జన విజ్ఞాన వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ.

జన విజ్ఞాన వేదిక 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను  సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర రావు  ఆవిష్కరించారు.

పొదిలి డివిజన్ అధ్యక్షులు డి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బి దేవ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటుచేసిన సమావేశంలో సిఐ సుధాకరరావు ఆవిష్కరించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మూఢ విశ్వాసాలకు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, రైస్ పుల్లింగ్, లంకె బిందెలు అని మాయమాటలు చెప్పి కొంతమంది మోసగాళ్ళు ప్రజలను మభ్య పెడుతుంటారు. ఇలాంటి వారి మాటలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, జన విజ్ఞాన వేదిక కూడా ఈ విషయంలో బాగా కృషిచేసి ప్రజలలను చైతన్య వంతులుగా చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి వి రంగయ్య రామాంజనేయులు, సీఐటీయ నాయకులు ఎం రమేష్, యుటిఎఫ్ నాయకులు పిల్లి రమణారెడ్డి, రాజేశ్వరరావు, కాశి రెడ్డి నాగార్జున, కృపారావు,చలం వెంకటేశ్వర్లు, ఆంజనేయ చౌదరి, యం వి శ్రీనివాసులు, వెంకట సుబ్బారావు, డాక్టర్ ఎర్రం రెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ ఇమాన్ సాహెబ్, హబీబుల్లా పౌండేషన్ చైర్మన్ కరిముల్లాబేగ్ పాల్గొన్నారు..