జనసేనలో పది కుటుంబాల చేరిక

పొదిలి గ్రామ పంచాయతీలోని ఇస్లాంపేటలో గల కుటుంబాలలో పది కుటుంబాలు జనసేనలో చేరాయి. వివరాల్లోకి వెళితే ప్రజలలోకి విస్తృతంగా ప్రచారానికి వెళ్లిన జనసేన నాయకులకు అడుగడుగున ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న పొదిలి జనసేన మండల నాయకులు ముల్లా బాజి కరిముల్లా, షేక్ కలేషా ఆధ్వర్యంలో విశ్వనాథపురంలోని ఇస్లాంపేట పది కుటుంబాలు జనసేనలో చేరాయి. జనసేన భావాలు నచ్చి పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాని, అబ్దుల్ రసూల్, మౌలాలి, మహబూబ్ బాషా, మహబూబ్ షరీఫ్, ఇలియాజ్, నాగూర్ బాషా, ఖాసీం, మొహమ్మద్ అసిఫ్, ముషారఫ్, హామద్, మహాబున్ని, ఫిర్దోస్, హుస్సేన్ బి, షాహీన, ఆస్మా, రేష్మ, ఇంతియాజ్, కరిష్మా, లాల్ బి, తదితరులు పాల్గొన్నారు.