జనసేన సోషల్ జస్టిస్ విభాగం జిల్లా కోకన్వీనర్ గా పట్నం శ్రీనివాస్ ఎంపిక

ప్రకాశంజిల్లా జనసేన పార్టీ సోషల్ జస్టిస్ విభాగం కోకన్వీనర్ గా పట్నం శ్రీనివాస్ ను ఎంపిక చేసారు. పొదిలి పట్టణంలో సీనియర్ పాత్రికేయుడుగా గత 15 సంవత్సరాల పని చేస్తున్న పట్నం శ్రీనివాస్ పాత్రికేయ వృత్తిని మనిజనసేన పార్టీ చేరి కీలకమైన స్ధానం సంపాదించారు. వెనుకబడిన తరగతులు చెందిన తనకు కీలకమైన బాధ్యత అప్పగించాటం పట్ల జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ మరియు సోషల్ జస్టిస్ రాష్ట్ర కన్వీనర్ టి శివ శంకర్ రావు కు పట్నం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సోషల్ జస్టిస్ విభాగంలో బిసి యస్సీ యస్టీ మైనారిటీ దివ్యాంగులు వీర మహిళలలను కలుపుకొని పోలింగ్ బూత్ కమిటీ మండల కమిటీ నియైజకవర్గంల కమిటీలు సంబంధించిన నిర్మాణం చేస్తున్నమని త్వరలో పార్టీ కార్యలయలు కూడా ప్రారంభింస్తున్నట్లు తెలిపారు