ప్రభుత్వ వైద్యశాలలో పాలు, రొట్టెల పంపిణీ
జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్ధానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు షేక్ కాలేషా మాట్లాడుతూ స్వామి వివేకానంద స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా జనసైనికులుగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ చక్రవర్తి, జనసేన యువ నాయకులు షేక్ హల్ చల్ జహీర్, యస్పీ ఖాజా, అర్జున్ యాదవ్, జిందాబాషా, ఆరిజ్, తదితరులు పాల్గొన్నారు.