జనసేన భగత్ సింగ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం…..

పొదిలి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( తూర్పుపాలెం) వద్ద జనసేన భగత్ సింగ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా జనవరి 31వతేదీ గురువారంనాడు మెగా వైద్యశిబిరం ప్రారంభిస్తున్నట్లు మండల జనసేన నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు డాక్టర్లచే గుండె, ఎముకలు, కీళ్లు, బిపి, షుగర్, గ్యాస్ట్రిక్, కంటి, మరియు సాధారణ వ్యాధులకు సంబంధించిన వివిధ విభాగాల డాక్టర్లచేత ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తారని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రకటనలో కోరారు.