అన్ లైన్ తరగతుల పేరుతో ఫీజులు వసులుపై జనసేన ఫిర్యాదు

అన్ లైన్ తరగతుల పేరుతో తల్లిదండ్రులు నుండి బలవంతపు ఫీజులు వసూలుకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది.

వివరాల్లోకి వెళితే గురువారంనాడు స్ధానిక మండల విద్యాశాఖ కార్యాలయం నందు సిబ్బందికి జనసేన పార్టీ విద్యార్థి విభాగం భగత్ సింగ్ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.