జనసేనలో నాదేండ్ల మనోహర్ చేరిక

విజయవాడ: మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో శుక్రవారం నాడు విజయవాడ పార్టీ కార్యలయంలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కరరావు తనయుడు నాదేండ్ల మనోహర్ తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన ప్రభావం కాంగ్రెస్‌పై పడడంతో గత ఎన్నికల్లో ఓటమి చవిచూసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలతో వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నాదెండ్ల మనోహర్ ఇవాళ జనసేన పార్టీలో చేరారు . 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని తెలుస్తోంది.