జనసేన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
పొదిలి మండల జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. స్థానిక రహదారులు మరియు భవనముల అతిథి గృహంలో జరిగిన 2019 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు హల్చల్ జహీర్, డిఎంకె నాయుడు, నాగార్జున యాదవ్, మదార్ వలి, సమీర్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.