1న జనసేన ఆధ్వర్యంలో కొవ్వత్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంకారెడ్డి మరియు రోజ హత్య సంఘటనలను నిరసిస్తూ “చెప్పుకుని ఏడుద్దామా! చెప్పుతో కొడదమా” అనే నినాదంతో జనసేన పిలుపులో భాగంగా రేపు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి పెద్ద బస్టాండ్ వరకు కొవ్వత్తుల ప్రదర్శన జరుగుతుందని….. మండల జనసేన పార్టీ నాయకులు పేరుస్వాముల శ్రీనివాస్, హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్ విజయ్ షేక్ ఖాజా షేక్ అహ్మమద్ లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ పాల్గొననున్నారని…. కావున ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.