జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రాభివృద్ది సాధ్యం : జంకె

జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మార్కాపురం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి అన్నారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం సలకనూతల దొండ్లేరు పోలింగ్ బూత్ పరిధిలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జంకె వెంకట రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబులా పూటకి ఒక మాట మార్చే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదన్నారు. రూణమాఫీ, వర్తించక రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అప్పుల భాధతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నవరత్నాలతో భరోసా కల్పిస్తున్నారని అన్నారు. సదరు పోలింగ్ బూత్ లోని ఇంటి ఇంటికి తిరిగి నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు, మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు వైసీపీ నాయకులు షంషీర్ అలీ బేగ్, మందటి మహేశ్వరరెడ్డి మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి, స్ధానిక నాయకులు సమాధానం , రమణరెడ్డి , ఆది, యువజన విభాగం నాయకులు వెలుగోలు కాశీ, గౌస్ , రబ్బాని తదితరులు పాల్గొన్నారు