ఉడముల ఆది లక్ష్మమ్మ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జంకె, సాయి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

స్వర్గీయ కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల వెంకట రెడ్డి సతీమణి ఉడుముల ఆది లక్ష్మిమ్మ (91) బుధవారం రాత్రి మృతి చెందారు.

కొనకనమిట్ల మండలం చిన్నరికట్ల గ్రామంలోని మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి స్వగృహంలో నందు ఆది లక్ష్మిమ్మ మృతదేహానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

ఉడుముల కుటుంబానికి జిల్లాల్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు