కొద్ది సమయం సినిమాలకు కేటాయించి మమ్మల్ని ముందుండి నడిపించాలని పవన్ కళ్యాణ్ కోరిన ఇమ్మడి

కొద్ది సమయం సినిమాలు చేస్తూ మమ్మల్ని ముందుండి నడిపించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ విజ్ఞప్తి చేశారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు అమరావతి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రకాశంజిల్లా కార్యకర్తలు సమావేశంలో హాజరైన పవన్ కళ్యాణ్ దృష్టికి పలు అంశాలు తీసుకుని వెళ్లిన ఇమ్మడి జనసైనికులలో ఉత్సాహం నింపడంకోసం సినిమాలు తీయాలని అందుకోసం కొద్దిపాటి సమయం సినిమాలకు కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర,జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.