జవాన్లకు జోహార్లు తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారంనాడు జరిగిన ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని….. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని…… వారి కుటుంబ సభ్యులు త్వరగా దిగ్భ్రాంతి నుండి బయటకు రావాలని ఆల్ఫా విద్యాసంస్థ విద్యార్థులు కొవ్వొత్తులతో విశ్వనాధపురంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఒంగోలు – కర్నూలు రహదారిపై మానవహారం నిర్వహించి……. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అని…… దేశసేవలో ప్రాణాలర్పించిన జవాన్లకు జోహార్లు పలుకుతూ……. పాకిస్తాన్ ముర్దాబాద్…… భరత్ మతాకి జై అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫా విద్యాసంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.