జేసిబి,ఆటో ఢీ…. ఒకరికి తీవ్ర గాయాలు

కొనకనమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామం వద్ద జేసిబి ఆటోను ఢీకొన్న ఘటనలో దొనకొండ మండలం తెల్లబాడు గ్రామానికి చెందిన వీరారెడ్డి సుబ్బారెడ్డికి తలకు, కాళ్లకు తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.