ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా జిలానీ ఎన్నిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టు ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గా షేక్ రాములేటి జిలానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఒంగోలు జరిగిన సమావేశంలో పొదిలి గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టు యస్ఈ కార్యాలయం నందు పనిచేస్తున్న షేక్ జిలానీ ని ప్రకాశం జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గా ఎన్నికల పట్ల పలువురు అభినందించారు