కాశ్మీర్ లో 92.5 శాతం భూగంలో ప్రశాంతం 230 మంది ఉగ్రవాదులు పొంచిఉన్నారు :అజిత్ దోవల్
జమ్మూ కాశ్మీర్ భూభాగంలో ప్రస్తుతం 92.5 శాతం ప్రశాంతంగా ఉందని అదేవిధంగా సరిహద్దు వెంట 230మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో తాజా పరిస్థితులను గురించి శనివారం నాడు తన ట్విట్టర్ లో ప్రకటన చేసిన సందర్భంగా మరికొన్ని రోజల్లోనే జమ్మూ కాశ్మీర్ సాధారణ పరిస్థితి వస్తుందని పొంచిఉన్న 230ఉగ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని వారు ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా తిప్పికొడతామని తన ట్విట్టర్ ప్రకటన చేశారు.