4వ సచివాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
అధికారుల తీరు మార్చుకోవాలని హెచ్చరిక
పొదిలి మండలంలోని గ్రామాలు మరియు పొదిలి నగర పంచాయితీ లోని సచివాలయం నాలుగును జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ విశ్వానాథ్ సందర్శించి అధికారుల తీరు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ఒటియస్ లబ్దిదారులు 15 వేల రూపాయల చెల్లింపులు చేయ్యవలసి ఉండగా అధికారులు మాత్రం 10 రూపాయలు తీసుకోవటంతో అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పొదిలి మండల హౌసింగ్ అధికారి ఎక్కడ అని ప్రశ్నించి అతన్ని సస్పెండ్ చేయాలని జిల్లా అధికారికి ఆదేశాలు జారీచేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవీప్రసాద్, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు