గ్రామ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
పొదిలి మండల పరిధిలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ గ్రామ, వార్డు సచివాలయంల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
శుక్రవారం నాడు పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 6వ వార్డు సచివాలయాన్ని, గ్రామీణ మండల పరిధిలోని మల్లవరం గ్రామ సచివాలయాన్ని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత దస్త్రాలను పరిశీలించినట్లు సచివాలయం సిబ్బంది తెలిపారు.
జాయింట్ కలెక్టర్ వెంట పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు గ్రామ వార్డు సచివాలయల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు