జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా తహశీల్దార్లు
జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా తహశీల్దార్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒకటైన పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల మంది పేదలకు ఇళ్ళు పంపిణీ చేసే కార్యక్రమానికి సంబంధించి…… సదరు లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలను రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో భాగంగా జీఓ నంబరును 43ను విడుదల చేసింది.
ఈ జీఓ ప్రకారం తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాను కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆయా తహశీల్దార్ల మండలాల పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసే భాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఈ జీఓను విడుదల చేసింది.