రోడ్డు ప్రమాదం లో పాత్రికేయుడు మృతి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి మండలం సలకనూతల గ్రామ సమీపంలో రోడ్డుప్రమాదం లో పొదిలి ప్రజాశక్తి దినపత్రిక పాత్రికేయుడు నరసింహారావు మృతి చెందిన సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.

గత 15 సంవత్సరాలుగా పొదిలి పట్టణం నందు పాత్రికేయ వృత్తిలో పని చేస్తు పొదిలి ప్రాంత ప్రజల మన్ననలను పొందుతు సౌమ్యుడు గా వృత్తి పట్ల అంకితభావం పని చేస్తున్న నరసింహారావు మృతి పట్ల పొదిలి,కొనకనమీట్ల మండల చెందిన పాత్రికేయులు, వివిధ రాజకీయ పార్టీల చెందిన నాయకులు ప్రజా సంఘాల నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.