పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన న్యాయమూర్తి

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని స్థానిక పెద్ద బస్టాండ్ లోని ప్రభుత్వ పాఠశాల సముదాయాన్ని పొదిలి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి భార్గవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేసి సరిగా లేకపోవడం సంబంధించిన కాంట్రాక్టర్ ను మందలించారు. అదేవిధంగా పారిశుద్ధ్య సరిగా లేకపోవడం గమనించి తక్షణమే యాజమాన్యం పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని కోరారు.

పాఠశాలలో మంచి నీటి సమస్య మరియు పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులు లేరని అదే విధంగా పాఠశాల ప్రధాన ద్వారం చుట్టూ ప్రక్కల ఆక్రమణకు గురికావడం ఆందోళన విద్యార్థులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయమూర్తి దృష్టికి ఉపాధ్యాయులు తీసుకొని వచ్చారు.

అనంతరం తరగతిలో విద్యార్థులు తో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి వెంట సహాయ ప్రభుత్వ న్యాయవాది దర్నాసి రామారావు, న్యాయవాది రమణ కిషోర్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు