జ్యూడిషియల్ ప్రివ్యూ అధికారిక లోగో మరియు వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టం ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయముల (న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత), 2019చట్టము 14.08.2019 నుండి అమలులోకి తీసుకువచ్చారు.

ఈ చట్టాన్ని అనుసరించి న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా రాష్ట్రములో మౌలిక సదుపాయముల టెండర్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడానికి, దాని ద్వారా ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధముగా వినియోగించుకునేట్లుగా చూడడానికి మరియు అందుకు సంబంధించిన లేదా అనుషంగికమైన విషయములు….. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఏజెన్సీ లేదా స్ధానిక అధికారి, 100కోట్ల రూపాయలు అంతకుమించిన మౌలికసదుపాయముల ప్రాజెక్టులకు సంబంధించి టెండరుకు సంబంధించిన పత్రములన్నింటిని న్యాయపరమైన ముందు సమీక్షకు గౌరవ న్యాయమూర్తికి సమర్పించాలి.

ప్రజా ప్రయోజనములో ప్రభుత్వ వనరులను అనుకూలమైన విధంగా వినియోగించేటట్లు, ఆ ప్రకారంగా అనుసరించవలసిన ప్రకియలలో పారదర్శకతను తీసుకురావడం ముఖ్యఉద్దేశ్యంగా ఈ సంస్థను నెలకొల్పారు.

జడ్జి జ్యుడిషియల్‌ – ప్రివ్యూ యొక్క అధికారిక లోగో మరియు వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారంండు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ప్రారంభించారు.
వెబ్ సైట్: judicialpreview.ap.gov.in

ఈ కార్యక్రమంలో జస్టిస్‌ డా. బి. శివశంకరరావు, జడ్జి – జ్యుడీషియల్‌ ప్రివ్యూ, ఆంధ్రప్రదేశ్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులు శ్రీ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శ్రీ అజేయ కల్లం, సీఎం ప్రిన్సిపల్‌ అడ్వైజర్, శ్రీ రజత్‌ భార్గవ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, శ్రీ సిద్దార్ధ్‌ జైన్, కమీషనర్‌ మరియు ఇన్‌స్పెక్టర్‌ జనరల్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ, శ్రీ ఎస్‌. శ్రీరామ్, అడ్వొకేట్‌ జనరల్, ఆంధ్రప్రదేశ్, శ్రీ ఏవి. పటేల్, జాయింట్‌ డైరెక్టర్, ఏపి ఇండస్ట్రీస్, శ్రీ వై. శరత్‌బాబు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్, ఏపిఐఐసి, గుంటూరు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.