దిశ హత్యను నిరసిస్తూ గ్రామ సచివాలయ స్వచ్ఛంద కార్యకర్తల ర్యాలీ
తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో దిశ హత్యాచారం హత్యకు గురి కావడంపై నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గ్రామ సచివాలయం స్వచ్ఛంద కార్యకర్తల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుండి చిన్నబస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ సచివాలయ మహిళా స్వచ్ఛంద కార్యకర్తలు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళలకు భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, పంచాయతీ అధికారులు మారుతిరావు,
పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ సచివాలయ స్వచ్ఛంద కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.