పొదిలికి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : సామాన్య ప్రజాపార్టీ అభ్యర్థి కడియం రామయ్య
పొదిలికి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ సామాన్య ప్రజాపార్టీ అభ్యర్థి కడియం రామయ్య యాదవ్ అన్నారు.
సామాన్య ప్రజాపార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదిలి విచ్చేసిన సందర్భంగా పొదిలిటైమ్స్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలో సాగునీటి, తాగునీటి సమస్య పెరిగిపోయిందని…… అలాగే పొదిలిలో తాగునీటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సామాన్య ప్రజాపార్టీ ద్వారా మేలుచేయడానికి తమ అమూల్యమైన ఓటును కరెంటు స్తంభంపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
సామాన్య ప్రజాపార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవిధంగా రైతులతో కలిసి ధర్నాలు, దీక్షలు చేసి వెలుగొండ సాధించుకుందామని….. అలాగే పొదిలి ప్రత్యేక రిజర్వాయర్ ద్వారా నీటిని తెచ్చేందుకు కూడా శ్రమిస్తానని ఆయన అన్నారు.