ఓటు హక్కు ఆవశ్యకతపై కళాజాత సాంస్కృతిక ప్రదర్శన
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటుహక్కు పై అవగాహన కల్పించడానికి కళాజాత బృందం పలు మండలాల్లో ఓటు నమోదు అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తూ శుక్రవారంనాడు పొదిలి చేరుకున్నారు. స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఓటుహక్కు యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, ఓటు హక్కుకు అర్హులైన వారందరు ఓటు నమోదు చేసుకోవాలని సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని ఓటు నమోదుకు ఈనెల 31వరకు గడువు ఉందని 31లోగా ఫారం-6ను ఎన్నికల నమోదు అధికారికి కానీ, తహశీల్దార్ కు కానీ, బూత్ లెవల్ అధికారికి కానీ ఇవ్వడంద్వారా నమోదు చేసుకోవచ్చునని అలాగే నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ నందు కానీ, ఏపి ఆన్లైన్ ద్వారా కానీ, మీసేవ ద్వారా కానీ, ఈ సేవా కేంద్రంలో కానీ నమోదు చేసుకునే వీలుందని అర్హులైన ప్రతిఒక్క యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జానీ బేగ్, ఆర్ఐ సుబ్బారాయుడు,
విఆర్ఓలు బ్రహ్మారెడ్డి, మురళి, తెదేపా నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.